చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి.. ఆ సంఘాల డిమాండ్
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న..Round Table Meeting in Kataram
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు శనివారం కాటారం మండల కేంద్రంలో ప్రజాసంఘాలు రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. కాటారం, మహాదేవపూర్, మల్హర్, పలిమేల, మహాముత్తారం మండలాలకు తాగునీరు అందించేందుకు తలపెట్టిన మహదేవపూర్ మండలంలోని బీరసాగర్ వద్ద స్థాపన చేసిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం(చిన్న కాలేశ్వర పథకం) 2008 లో 45 వేల ఎకరాల భూములకు రూ. 499 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రజాసంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాటారంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో రాజకీయ పార్టీలు, కుల సంఘాలతో కమిటీని ఏర్పాటు చేశారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం, తహశీల్దార్లకు, ఆర్ డీవోకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాటారం ఎంపీపీ సమ్మయ్య, అజ్మీర పూల్ సింగ్, పీక కిరణ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మందల లక్ష్మారెడ్డి, కుడిమేత సమ్మయ్య, రవీందర్రావు, బోడ రాజు తదితరులు పాల్గొన్నారు.