రోహిత్ శర్మకు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా

ముంబయి: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు - Rohit Sharma gets Rs 12 lakh fine for slow over-rate against Delhi Capitals

Update: 2022-03-28 14:40 GMT

ముంబయి: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన ముంబై వర్సెస్ ఢిల్లీ తొలి ఐపీఎల్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా విధించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఐపీఎల్ సీజన్-15‌లో జరిమానా పడిన తొలి సారధిగా రోహిత్ శర్మ నిలిచాడు.

ఇకపోతే తొలి మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177/5 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మన్ ఇషాన్‌ కిషన్‌ (48 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. అనంతరం ముంబై విధించిన టార్గెట్ ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు 18.2 ఓవర్లలోనే నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను ముగించారు. లిలిత్‌ యాదవ్‌ 38 బంతుల్లో 48 (నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ 17 బంతుల్లో 38 (నాటౌట్‌)గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో నిర్దిష్ట సమయంలోగా ముంబై జట్టు బౌలింగ్‌ కోటా పూర్తిచేయకపోవడంతో జరిమానా విధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News