పండుగ వేళ విషాదం.. టూ వీలర్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్

Update: 2022-03-01 13:57 GMT

దిశ, జవహర్ నగర్: గేదెలను పెంచుకుంటూ పాల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలోని మోహన్ రావు కాలనీలో నివాసం ఉంటున్న దగ్గుపాటి నాయుడు (61) ఎన్నో ఏళ్లుగా గేదెలను పెంచుకుంటూ పాల వ్యాపారం చేస్తుండేవారు. గత కొంతకాలంగా తన ఇంట్లో ఉన్న గేదెల షెడ్డు ను నగరంలోని డంపింగ్ యార్డ్ సమీపంలోకి మార్చారు. ఇదే క్రమంలో మోహన్ రావు నగర్ కాలనీలోని తన ఇంటి నుండి మధ్యాహ్నం సమయంలో యాక్టివా మీద షెడ్డు దగ్గరకు బయల్దేరాడు.

ఇదే క్రమంలో డంపింగ్ యాడ్ సమీపానికి చేరుకోగానే తిమ్మాయిపల్లి నుండి చెన్నాపురం వస్తున్న ట్రాక్టర్.. యాక్టివ్ ను ఢీ కొట్టింది. దీంతో దగ్గుబాటి నాయుడు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News