RGV: చిక్కుల్లో వర్మ 'డేంజరస్'.. ముందుకు రాని థియేటర్లు
దిశ,వెబ్ డెస్క్ : తను తీసిన సినిమా హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విస్తృతంగా ప్రచారం చేసుకోగల దర్శకుడు రామ్ గోపాల్
దిశ,వెబ్ డెస్క్ : తను తీసిన సినిమా హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విస్తృతంగా ప్రచారం చేసుకోగల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ ఎప్పుడు తన సినిమాలు, వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటాడు. అతడు చేసే ప్రతి సినిమా హాట్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా ఆర్జీవీ చేసిన "మా ఇష్టం: డేంజరస్' మూవీలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా నట్టి కుమార్ నిర్మాణంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా దర్శకుడు ఆర్టీవీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. 'డేంజరస్' కథాంశం లెస్బియన్స్‌ది కావడంతో విడుదలకు థియేటర్లు ముందుకురావడం లేదని, అందుకే సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు. అయితే త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాడు. నిజానికి ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, ట్రైలర్ చూస్తే ఇది కేవలం పెద్దవాళ్లకు మాత్రమే అన్నట్లుగా కనిపిస్తోంది. కానీ 'డేంజరస్' క్రైమ్ డ్రామా.ఇన్నేళ్లుగా సినిమాల్లో ఇదొక ప్రయోగంగా పేర్కొన్నారు. స్వలింగ సంపర్కలైన ఇద్దరు మహిళల ప్రేమకథ 'డేంజరస్' అని చెప్పుకొచ్చారు.
మా ఇష్టం DANGEROUS సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022