రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు.. హాజరుకానున్న మంత్రి

దిశ, ప్రజ్ఞాపూర్: నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు గజ్వేల్​ మండలం బెజుగామలో.. Latest Telugu News..

Update: 2022-03-17 08:09 GMT

దిశ, ప్రజ్ఞాపూర్: నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు గజ్వేల్​ మండలం బెజుగామలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామంలోని రావి చెరువు కట్ట సమీపంలో మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఆలయాన్ని గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలోనిర్మించారు. పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్ఠ, రేణుక ఎల్లమ్మ కార్యక్రమాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు గణపతి పూజతో కార్యక్రమాలు మొదలు కానున్నాయి.

కార్యక్రమ వివరాలు ఇలా..

* 26న ఉదయం 10.30గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాదావణ, అగ్నిప్రతిష్ఠ, సాయంత్రం 5గంటల నుంచి మండపారాధన, జలదివాసం, ప్రదోష పూజ, మంగళ హారతి కార్యక్రమాలు ఉంటాయి.

*27న ఉదయం 9గంటల నుంచి ప్రాతఃకాల పూజ హవనములు, బొట్టుపెట్టు, మహాస్వపనం, విగ్రహ గ్రామ ప్రదక్షిణ, సాయంత్రం 5 గంటల నుంచి పోచమ్మ భోనాలు, మూల మంత్ర హోమాలు, దాన్య, శయ్య, ఫల, ఆదివాసాలు, మంగళ హారతి, ప్రదోష పూజ, రాత్రి ఒగ్గు కథ ఉంటుంది.

* 28న ఉదయం 9గంటల నుంచి పుట్టకమ్మట, గుప్త సంస్కారం, యంత్ర ప్రతిష్ట, దృక్​బలి కళాన్యాసం, ప్రాణ ప్రతిష్ట, జయాదులు, మహాపూర్ణాహుతి, అవబృతం, బియ్యం సుంకిచుట, గంగకుపోవుట, మహామంగళహారతి, స్థాపిత దేవతాపూజ, పంచామృతములచే ఎల్లమ్మ తల్లికి మహాభిషేకం, రుద్ర హననం, లక్ష్మీ హవచనం, నవగ్రహ హవనం, స్థాపిత దేవతా హవనం, మంగళ హారతి, మంత్రపుష్పం, ఉదయం 11 గంటలకు యంత్ర ప్రతిష్ట ప్రాణప్రతిష్ట, దృక్​భళి పూర్ణాహుతి, సాయంత్రం 4 గంటలకు ఎదర్కోలు, పుట్ట బంగారం తేవడం, ఎల్లమ్మ (ఏడంతరాల భోనం) భోనాలు ఉంటాయి.


* 29న ఉదయం 10.02 గంటలకు దనుర్​లగ్న పుష్కరాంశ సుముహూర్తమున రేణుక ఎల్లమ్మదేవి–జమదగ్ని కళ్యాణం నిర్వహిస్తారు. మహాదాశిర్వచనం, 3 గంటలకు గావరంగం, రాత్రికి ఒగ్గుకథ ఉంటాయి. ఒగ్గు స్వామి బృందంచే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

* 24 నుంచి 29 వరకు ప్రతి రోజు ఆలయం వద్ద 1 గంట నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది.

కళ్యాణానికి హాజరుకానున్న మంత్రి హరీష్​రావు

బెజుగామ నూతన ఎల్లమ్మ ఆలయంలో ఈ నెల 29న జరుగనున్న రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కార్పొరేషన్​ చైర్మన్​ వంటేరు ప్రతాప్​రెడ్డిలతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీలకు

చెందిన ముఖ్యులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఎల్లమ్మ కళ్యాణానికి హాజరుకావాలని గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు పెద్ద నర్సాగౌడ్​, కిష్టా గౌడ్,​ శ్రీనివాస్​గౌడ్​, లక్ష్మణ్​గౌడ్​, చిన్న నర్సాగౌడ్​, మల్లేష్​గౌడ్​, నర్సింలుగౌడ్​, దూలం శ్రీనుగౌడ్లతో పాటు సంఘం సభ్యులు మంత్రి హరీష్​రావుకు ఆహ్వాన ప్రతిక అందించారు. ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ రావాలని గౌడ్ సంఘము సభ్యులు కోరారు.

Tags:    

Similar News