మతం పేరుతో కించపరుస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్

సామాజిక మాధ్యమాలే కేంద్రంగా సోషల్ మీడియాలో ఒక మతాన్ని కించపరుస్తూ పోస్ట్ పెట్టిన అచ్చంపేట పట్టణానికి చెందిన కుల్కుందాకారి శివాజీ అనే అరెస్టు చేసినట్లు డీఎస్పీ పల్లె శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-11-05 16:30 GMT

దిశ, అచ్చంపేట: సామాజిక మాధ్యమాలే కేంద్రంగా సోషల్ మీడియాలో ఒక మతాన్ని కించపరుస్తూ పోస్ట్ పెట్టిన అచ్చంపేట పట్టణానికి చెందిన కుల్కుందాకారి శివాజీ అనే అరెస్టు చేసినట్లు డీఎస్పీ పల్లె శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పై వ్యక్తి అచ్చంపేట పట్టణంలో మటన్ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నాడని తాను ఈ నెల 02 న సాయంకాలం ఆరు గంటల సమయంలో తన వాట్సాప్ గ్రూపు నందు మరో మతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ చేశాడన్నారు. ఆ విషయం పై అచ్చంపేట పీఎస్ నందు ఫిర్యాదు అందగా ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని ఆ నిందితుడిని కోర్టు నందు హాజరు పరిచారన్నారు. కావున అచ్చంపేట ప్రజలరా సోషల్ మీడియాను దుర్వినియోగం చేయవద్దన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేసిన యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Similar News