Red Banana Benefits: రెడ్ బనానా తింటే ఇన్ని ప్రయోజనాలా!

Red Banana Benefits| సాధారణంగా అరటి పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయని తెలిసిందే. కానీ ఏ రకం బనానాలో పోషకాలు అధికమనే విషయంపై కొందరికే అవగాహన ఉంటుంది. గ్రీన్, ఎల్లో రకాలతో పోలిస్తే రెడ్ కలర్‌ బనానాలో న్యూట్రియంట్స్‌తో పాటు కెరోటినాయిడ్స్, విటమిన్-సి, మినరల్స్,

Update: 2022-07-09 08:13 GMT

దిశ, ఫీచర్స్ : Red Banana Benefits| సాధారణంగా అరటి పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయని తెలిసిందే. కానీ ఏ రకం బనానాలో పోషకాలు అధికమనే విషయంపై కొందరికే అవగాహన ఉంటుంది. గ్రీన్, ఎల్లో రకాలతో పోలిస్తే రెడ్ కలర్‌ బనానాలో న్యూట్రియంట్స్‌తో పాటు కెరోటినాయిడ్స్, విటమిన్-సి, మినరల్స్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడి, ఆరోగ్యవంతమైన జీవితానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ప్రయోజనాలు :

* రెడ్ బనానాలో మెండుగా లభించే పొటాషియం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రేచీకటితో ఇబ్బందిపడేవారు రాత్రి భోజనం తర్వాత ఈ అరటి పండ్లను తింటే ఆ సమస్య నయమయ్యే చాన్స్ ఉంది.

* నరాల బలహీనతతో బాధపడేవారు 48 రోజుల పాటు క్రమంతప్పకుండా రెడ్ బనానా తింటే ఉపశమనం లభించే అవకాశం ఉంది.

* చర్మంపై ఏర్పడే దద్దుర్లు, గజ్జి, తామర వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

* ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్‌ను పెంచుతాయి. రక్తహీనత లోపాన్ని అధిగమించేందుకు విటమిన్ బి6 సాయపడుతుంది.

* క్యాన్సర్, గుండె సమస్యలు తలెత్తకుండా నివారించడంతో పాటు చెస్ట్ అలర్జీని తగ్గిస్తుంది.

* ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత ఒక బనానా తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతో పాటు లివర్ ఇన్ఫెక్షన్, యూరినరీ డిజార్డర్స్‌ కంట్రోల్ అవుతాయి.

Also Read:  ఈ పువ్వును ఎప్పుడైనా తిన్నారా...? తింటే చాలా లాభాలుంటాయి 

Tags:    

Similar News