జమ్మూలో 76 ఏళ్ల తర్వాత రికార్డ్ ఉష్ణోగ్రతలు
శ్రీనగర్: జమ్మూలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.- latest Telugu news
శ్రీనగర్: జమ్మూలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 37.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతవరణ శాఖ అధికారి సోనం లోటస్ తెలిపారు. మార్చి నెలలో 76 ఏళ్ల తర్వాత నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని అధికారులు వెల్లడించారు. కాగా, అంతకుముందు 1945లో మార్చి 31న 37.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. గత నాలుగు రోజులుగా వాతవరణంలో ఎలాంటి ఆకస్మిక మార్పులు లేకుండా స్పష్టంగా ఉందన్నారు. రాబోయే కొన్ని రోజులు పొడిగా, వేడిగా ఉంటాయని తెలిపారు.