6,400mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్న Realme Pad Mini
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Realme కొత్తగా Realme Pad Mini..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Realme కొత్తగా Realme Pad Mini సరికొత్త డిజైన్‌తో లాంచ్ చేసింది.ఇది octa-core Unisoc T616 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 6,400mAh బ్యాటరీని కలిగి ఉంది.
Realme Pad Mini స్పెసిఫికేషన్స్..
*8.7-అంగుళాల LCD (1,340×800 పిక్సెల్‌లు) డిస్‌ప్లే, స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 84.59 శాతం. డిస్‌ప్లే సన్‌లైట్ మోడ్‌ను కలిగి ఉంది.
*ఇది కొత్త Realme UIతో Android 11లో నడుస్తుంది.
*Mali-G57 MP1 GPUతో పాటు ఆక్టా-కోర్ Unisoc T616 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ప్రాసెసర్ గరిష్ట వేగం 2.0GHz.
*ఇది 4GB RAM గరిష్టంగా 64GB UFS 2.1 ఆన్‌బోర్డ్ నిల్వను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.
*వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరా ముందు, భాగంలో 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది.
*ఇది 6,400mAh బ్యాటరీతో, 18W ఫాస్ట్ చార్జింగ్‌కు, రివర్స్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.
*కనెక్టివిటీ ఫీచర్లలో GSM, బ్లూటూత్ v5, WLAN ఉన్నాయి.
*ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3GB + 32GB, 4GB + 64GB.
ప్రస్తుతానికి ఇది ఫిలిప్పీన్స్‌లో విడుదలైంది. త్వరలో ఇండియాలోకి రానుంది. దీని ధర, ఇతర వివరాలు లాంచ్ టైం లో తెలస్తాయి.