దానిపై ఎంఐఎం నేతల కన్ను.. ఇంచు కూడా వదలం: రవీందర్ సింగ్ హెచ్చరిక

దిశ, తిమ్మాపూర్: దేశ అత్యున్నత న్యాయస్థానం నగరపాలక సంస్థకు అనుకూలంగా- latest Telugu news

Update: 2022-03-20 17:03 GMT

దిశ, తిమ్మాపూర్: దేశ అత్యున్నత న్యాయస్థానం నగరపాలక సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఎంఐఎం నేతలు ప్రధాన కూరగాయల మార్కెట్ స్థలాన్ని కబ్జా చేశారంటూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. దశాబ్దాలుగా ఈ స్థలం మున్సిపల్ ఆధీనంలో కొనసాగుతుందని తెలిపారు. 2002లో హైకోర్టు ఈ స్థలం నగరపాలక సంస్థకు సంబంధించినదేనని అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చిందని.. ఆ తర్వాత కొంతమంది కబ్జాసురులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా న్యాయస్థానం అక్కడ కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.

కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ స్థలాన్ని ఎంఐఎం నేతలు కబ్జా చేయడమే కాక.. మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని ఎలా కోరతారని రవీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని తెలిసిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆ స్థలాన్ని వారికి కేటాయించాలని ఎలా కోరమని చెప్పారో తెలపాలన్నారు. మరోసారి మార్కెట్ స్థలం వైపు కన్నెత్తి చూసిన ప్రజలకు చెందిన ఆస్తులను ఎవరు కబ్జా చేయాలనీ ప్రయత్నం చేసినా ఊరుకునేది లేదని ఇంచు భూమి కూడా ఎంఐఎం నేతలకు వదిలేదని తేల్చి చెప్పారు. వక్ఫ్ బోర్డుకు కేవలం 1052 గజాల స్థలం మాత్రమే ఉందని అంతకుమించి ఒక ఇంచు కూడా వదలమని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, జంగంపల్లి కుమార్, దండబోయిన రాములు, పెండ్యాల మహేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News