భారీ భద్రత నడుమ మళ్లీ జైలుకి డేరా బాబా

Update: 2022-02-28 12:22 GMT

ఛంఢీగఢ్: మూడు వారాల పెరోల్‌పై విడుదలైన డేరా బాబా అలియాస్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ సోమవారం జైలుకు వెళ్లారు. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే కేసులో ఆయనకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన డేరా బాబాకు కోర్టు మూడు వారాల పాటు పెరోల్ మంజూరు చేసింది. ఆదివారంతో గడువు పూర్తి కాగా, సోమవారం తిరిగి జైలుకు వెళ్లారు. డేరా చీఫ్‌ను గురుగ్రామ్ నుండి రోహ్‌తక్ జిల్లాలోని సునారియా జైలుకు భారీ భద్రతతో తీసుకువచ్చినట్లు రోహ్‌తక్ పోలీసు అధికారి తెలిపారు. ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించిన సంగతి తెలిసిందే. డేరా బాబా హార్డ్ కోర్ ఖైదీల కేటగిరీలోకి లేడని హర్యానా ప్రభుత్వం నిర్ధారించడంతో ఆయన విడుదలయ్యారు. మరోవైపు పంజాబ్ ఎన్నికలకు ముందు ఆయన విడుదల కావడం కూడా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News