Sri Lanka New President: ముగిసిన ఎన్నికలు.. శ్రీలంక‌కు నూతన అధ్యక్షుడి ఎంపిక

Ranil wickremesinghe Elected as a New President Of Sri Lanka| శ్రీలంకలో నూతన అధ్యక్షుడి కోసం జరుగుతోన్న ఎన్నికలు ముగిశాయి. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు. ఎంపీలు రణిల్ విక్రమ్ సింఘేను తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు

Update: 2022-07-20 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: Ranil wickremesinghe Elected as a New President Of Sri Lanka| శ్రీలంకలో నూతన అధ్యక్షుడి కోసం జరుగుతోన్న ఎన్నికలు ముగిశాయి. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు. ఎంపీలు రణిల్ విక్రమ్ సింఘేను తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక మొత్తం 213 ఓట్లు ఉండగా.. సింఘే 134 ఓట్లు సాధించాడు. దీంతో శ్రీలంక 8వ అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

అయితే, శ్రీలంక తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోంది. పాలకుల అసమర్థ నిర్ణయాలే సంక్షోభానికి కారణమని దేశ ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం విడిచి పారిపోయి.. పదవికి రాజీనామా చేశారు. గొటబాయ రాజీనామాతో దేశంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే శ్రీలంక 8వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి

Tags:    

Similar News