Ran Daggubati: ‘ది రానా దగ్గుబాటి’ షోతో రాబోతున్న రానా.. స్ట్రీమింగ్ ఎప్పుడు-ఎందులోనంటే?
ఓ పక్క వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ.. మరో వైపు హోస్ట్‌గా, బిజినెస్‌మెన్‌గా బిజీ బిజీగా గడుపుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఓ పక్క వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ.. మరో వైపు హోస్ట్‌గా, బిజినెస్‌మెన్‌గా బిజీ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ హీరో రానా(Rana). తాజాగా ఈ హీరో మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే గతంలో నెంబర్ వన్ యారి(Number one Yari) అనే టాక్ షో తో జనాల్ని అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కొత్తగా ‘ది రానా దగ్గుబాటి(The Rana Daggubati)’ అనే కొత్త పేరుతో టాక్ షో ను ప్రారంభించనున్నారు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ(Amazon Prime OTT)లో ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ షో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబర్ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఈ షోను హీరో రానానే ప్రొడ్యూసర్‌గా తన స్పిరిట్ మీడియా(Spirit Media)పై నిర్మించారు. ఇప్పటికే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) వంటి కొంతమంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షోకు ప్రముఖులే హాజరవుతారని టాక్ రావడంతో.. రానా టాక్ షోపై జనాల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది.