టికెట్ రేట్ల విషయంలో తప్పించుకున్న రామ్
దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఏడాదికి వందకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ..
దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఏడాదికి వందకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడంలో మెజారిటీ చిత్రాలు ఫెయిల్ అవుతున్నాయి. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా కలెక్షన్లు రాబట్టలేక నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. పెరిగిన టికెట్ ధరలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ సందర్భంగా మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో.. జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోయింది. మరోవైపు చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు సాధారణ రేట్లు కూడా తలకు మించిన భారంగా పరిణమించాయి. ఇదే క్రమంలో హీరో రామ్ నటించిన 'ది వారియర్' మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా మూడు భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ప్రమోషన్స్ సందర్భంగా రామ్‌ను ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరల గురించి ప్రశ్నిస్తే.. తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడాడు. 'టికెట్ల రేట్లు నా డిపార్ట్‌మెంట్ కాదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను' అంటూ సమాధానం దాటవేశాడు.