Ram Charan: గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్.. !!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-17 03:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా హీరో గేమ్ ఛేంజర్ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ కోసం గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ హీరో ఓ పక్కా సినిమాల్లో దూసుకుపోతూనే మరోవైపు సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఈయన ఎంతో మందికి సహాయం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుండె సమస్యతో బాధపడుతోన్న చిన్నారిని బతికించి గొప్పమనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ట్వీట్‌లో నిర్మాత ఇలా రాసుకొచ్చాడు. రామ్ చరణ్ కు అభినందనలు అని తెలిపాడు. ఆగస్టు 22 న జన్మించిన పాపకు చరణ్ హెల్ప్ చేశాడని తెలిపాడు. ఆ పాపకు సీరియస్ హార్ట్ కండిషన్ ఉందని.. పల్మనరీ హైపర్ టెన్షన్‌తో బాధపడుతుంటే తన కుటుంబానికీ చికిత్స అందించే స్థోమత లేకపోతే మన హీరో ముందుకొచ్చాడని పేర్కొన్నాడు. ఈ విషయం కాస్త గ్లోబల్ స్టార్ చెవిన పడటంతో మరో క్షణం ఆలోచించకుండా ట్రీట్మెంట్ మొత్తం ఇప్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడాడు. మొత్తం 53 రోజులు చికిత్స ఇప్పించాడని.. ట్రీట్మెంట్ కు కావాల్సిన డబ్బులు చరణ్ భరించాడని అన్నారు. చిన్నారి అక్టోబరు 16 తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యిందని వెల్లడించారు. దీంతో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 


Similar News