ఆరు నెలల్లో మొదలుపెడతా.. మహేశ్‌తో సినిమాపై రాజమౌళి క్లారిటీ

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శక ధీరుడు రాజమౌళి..latest telugu news

Update: 2022-04-02 10:43 GMT

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శక ధీరుడు రాజమౌళి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. మహేశ్‌తో చేయబోతున్న ప్రాజెక్ట్‌ను మరో ఆరు నెలల్లో పట్టాలెక్కించబోతున్నట్లు తెలిపాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన రాజమౌళి.. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేసేందుకు కనీసం 6 నెలల టైమ్ పడుతుందని చెప్పాడు. ఆ తర్వాతే మహేష్ మూవీని సెట్స్‌పైకి తీసుకొస్తామని ప్రకటించాడు. దీన్నిబట్టి చూస్తే ఈ నయా ప్రాజెక్ట్ అక్టోబర్‌లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే 'ఆర్ఆర్ఆర్' సక్సెస్‌‌తో ఊపుమీదున్న రాజమౌళి.. మహేశ్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తాడో అంచనాలకు అందడం లేదంటున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News