Today Weather Update: ఏపీ - తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన..!!

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ నుంచి మూడ్రోజుల వరకు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Update: 2024-10-15 03:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ నుంచి మూడ్రోజుల వరకు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా నిజామాబాద్‌, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని.. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో కూడా నేటి నుంచి 17 వ తారీకు వరకు కుండపోత వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించింది. నెల్లూరు, రాయలసీమ, ప్రకాశం జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని పేర్కొంది.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం.. 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Tags:    

Similar News