కూరగాయల షాపులో మహిళతో పరిచయం.. పదే పదే అలా చేయాలని కోరుతూ న్యూడ్‌గా..

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఓ మహిళను వేధిస్తున్న..latest telugu news

Update: 2022-04-10 14:00 GMT

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఓ మహిళను వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల నిందితుడు మహ్మద్ ఇజ్రాయిల్, బాధితురాలు రోజు కూరగాయలు కొనే చోటే తాను కొనేవాడు. ఇదే క్రమంలో ఆమెపై ప్రెమను పెంచుకున్నాడు. ఎలాగోలాగ ఆమె నంబర్ సంపాదించాడు. దాంతో అతను అనేక సార్లు ఆమెకు వర్చువల్ కాల్స్ చేసేవాడే. అంతేకాకుండా మహ్మద్‌ పదే పదే తనతో మాట్లాడాలిని కోరుతుండేవాడు. అందుకు బాధితురాలు నిరాకరించింది. అప్పటికే వారి మధ్య జరిగిన వీడియో కాల్స్ నుండి నింధితుడు స్క్రీన్‌షాట్‌లు తీశాడు. వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసి ఆమెకు పోస్ట్ చేశాడు. అంతేకాకుండా మహిళ స్నేహితులకు, బంధువులకు కూడా ఆ ఫొటోలను షేర్ చేశాడు. దీనిపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు అతడు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహ్మద్ ఇజ్రాయిల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Tags:    

Similar News