Pushpa-2: ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ వాయిదా.. పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’(Pushpa-2). దీనిని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తెరకెక్కిస్తున్నారు.

Update: 2024-10-10 13:31 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’(Pushpa-2). దీనిని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతుండటంతో ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప-2 (Pushpa-2)చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఈ క్రమంలో మేకర్స్ పుష్ప-2 (Pushpa-2)డిసెంబర్‌ 6న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా, ‘పుష్ప-2’(Pushpa-2) మూవీ డిసెంబర్ 6 విడుదల వాయిదా పడినట్లు ఒక రోజు లేట్‌గా థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాటిని చూసిన ఐకాన్ స్టార్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇన్నాళ్లు ఎదురు చూసినా లాభం లేదని మేకర్స్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. పుష్ప-2(Pushpa-2) మేకర్స్ ‘X’ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘ఈ సారి వెనక్కి తగ్గేది లేదు. డిసెంబర్ 6న (December 6)రావడం ఖాయం’’ అని పోస్ట్ ద్వారా తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల్లో జోష్ పెరిగింది.

Tags:    

Similar News