పదోన్నతి ఉద్యోగుల బాధ్యతను పెంచుతుంది: అదనపు ఎస్పీ రూపేష్
దిశ, జగిత్యాల కలెక్టరేట్: పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయని..Promotions increase employee liability: SP
దిశ, జగిత్యాల కలెక్టరేట్: పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ రూపేష్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ రూపేష్ జిల్లా పరిధిలో విధులు నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతులు పొందిన కోడూరి రాజమౌళి మేడి రాజయ్య, ఎలాపంటి ఉప్నేధర్ రాజు, గంగ శంకర్, వనారస రమణ, ఆడెపు శ్రీనివాస్, మహమ్మద్ అనీసుద్దిన్, చిప్ప రవీందర్, రామిడి శంకరయ్య, మోతుకూరి శ్రీనివాస్, ఆత్రం బహదూర్ షా, దాసరి ఎల్లయ్య, చిరం నారాయణ, బురఖా ప్రకాష్, మోహినుద్దీన్, ధనిక సౌందర్యలకు హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నంను అలంకరించి అభినందించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు. పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది, అధికారులు పోలీస్ శాఖలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. కింది స్థాయి సిబ్బంది నుండే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని.. దానిని పెంపొందే దిశగా పని చేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయన్నారు.