'కను దిష్టి' తగిలితే మాకు విడాకులే.. ప్రియాంక చోప్రా
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లడలేనంటోంది..Latest Telugu News
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లడలేనంటోంది. ఎందుకంటే తమ లైఫ్‌లో మంచి విషయాలపై జనాల నజర్ పడితే చెడు జరుగుతుందనే విశ్వాసాన్ని బలంగా నమ్ముతానని చెప్పింది.
ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ 7' సీజన్‌లో పాల్గొనబోతున్నట్లు చెప్పిన బ్యూటీ.. 5వ సీజన్‌లో తను పాల్గొన్నప్పటి డిస్కషన్ గుర్తు చేసుకుంది. అయితే పర్సనల్ లైఫ్ సీక్రెట్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడితే ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లుగా తెలిపింది. అలాగే ఉంగరంతో ముడిపడిన సంబంధం ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియదన్న నటి.. తాను పంజాబీ అమ్మాయిని కాబట్టి చెడు దృష్టిని ఖచ్చితంగా నమ్ముతానని వెల్లడించింది. ఇక ఈ సమాజంలో మంచి విషయాలు ఎప్పుడూ చెడును ఆకర్షిస్తాయని, అలాంటి వాటిని జాగ్రత్తగా నిర్వహించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.