Priya Anand: నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకుంటా.. సినీ నటి షాకింగ్​ కామెంట్స్​

Priya Anand Wants to marry Nithyananda Swami| పరిచయం అక్కరలేని పేరు నిత్యానంద స్వామి. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయనపై కేసులు నమోదు కావడంతోపాటు జైలు జీవితం కూడా గడిపాడు. తనకు తానే భగవంతుడిగా ప్రకటించుకున్న నిత్యానంద.. ప్రస్తుతం దేశాన్ని విడిచి

Update: 2022-07-09 06:19 GMT

దిశ, వెబ్​డెస్క్ : Priya Anand Wants to marry Nithyananda Swami| పరిచయం అక్కరలేని పేరు నిత్యానంద స్వామి. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయనపై కేసులు నమోదు కావడంతోపాటు జైలు జీవితం కూడా గడిపాడు. తనకు తానే భగవంతుడిగా ప్రకటించుకున్న నిత్యానంద.. ప్రస్తుతం దేశాన్ని విడిచి కైలాస దీవిలో సెటిల్​ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన చుట్టు ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. అంతకు రెట్టింపులో భక్తులను, ప్రేమికులను సంపాదించుకున్నాడీ రాసలీలల స్వామి. తాజాగా నిత్యానందను వివాహం చేసుకోవాలని ఉందని ఓ సినీ నటి షాకింగ్​ కామెంట్స్​ చేసి సంచలనం సృష్టించింది.

కోలీవుడ్‌లో వామనన్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన నటి ప్రియా ఆనంద్‌. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ నటి శివకార్తికేయన్, అధర్వ, విక్రమ్‌ ప్రభు, గౌతమ్‌ కార్తీక్, ఆర్‌జే బాలాజీకి జంటగా నటించింది. కాగా, ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. తను అమెరికాలో ఉన్నప్పటి నుంచి నిత్యానందను అభిమానిస్తున్నారని, ఆయనపై ఎలాంటి ప్రచారం జరుగుతున్నా వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్నారని చెప్పుకొచ్చింది. మరి ప్రియా ఆనంద్​ కోరిక తీరుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News