New Pak PM Shehbaz Sharif :తొలి ప్రసంగంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీశ్‌ ఎన్నికయ్యారు.

Update: 2022-04-12 02:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీశ్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు పాక్ 23వ ప్రధానమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అతనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఎల్లప్పుడు శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని, ఉగ్రవాదం లేని ప్రాంతంలో మనం అభివృద్ధి సాధించవచ్చని సూచించారు. కాగా, పాక్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ప్రతిపక్షాలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాయి. దీంతో చేసేదేంలేక ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, పాక్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన షాబాజ్‌కు పాక్ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమైంది.

అయితే.. పాకిస్తాన్‌ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్‌ షరీఫ్‌ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్‌ అంశాన్ని, భారత్‌ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్‌ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్‌ ప్రజలకు పాకిస్తాన్‌ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్‌ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ, కశ్మీర్‌ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. 

Tags:    

Similar News