మీ పిల్లలకు వడదెబ్బ తగల కూడదా.. ఇలా ట్రై చేయండి

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు భానుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు.

Update: 2022-04-10 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు భానుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. ఉదయం 10 దాటిందంటే చాలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో పిల్లలపై కుటుంబ సభ్యులు దృష్టి పెట్టాలి. వేడికి చాలా వరకు పెద్ద పెద్దవారే తట్టుకోలేక పోతుంటారు. ఈ సమయంలో పిల్లలకు ఎండదెబ్బ తాకిందంటే ఇక అంతే సంగతులు. అయితే వేసవిలో పిల్లలకు ఎండదెబ్బ తాకకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

వేసవికాలంలో తల్లిదండ్రులు పిల్లలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఎక్కువ సేపు స్నేహితులతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పాఠశాలలు లేక పోవడం వలన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అయితే వీలైనంత వరకు పిల్లలను సాయంత్రం 5 వరకు బయటకు పంపించక పోవడం వలన వారిని ఎండదెబ్బ నుంచి కాపాడవచ్చు.
  • పిల్లలకు వేసవి కాలం మొత్తం కాటన్ దుస్తులే వేయండి.
  • ప్రతీ రోజు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం,జ్యూస్‌లు చేసి పిల్లలకు ఇవ్వడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారు.
  • తమకు ఇష్టమైన వంటలు చేస్తూ వారు బయటకు వెళ్లకుండా చూసుకోండి.
  • అలాగే వేసవిలో చలువ అయినటువంటి కీర దోస, క్యారెట్,పుచ్చకాయలు, కర్భూజ వంటివి పిల్లలు తినేలా చూడండి.
  • వీలైనంత వరకు తల్లిదండ్రులు కూడా పిల్లలతో వేసవి కాలంలో టైమ్ స్పెండ్ చేయండి
  • రోజు ఎక్కువగా వాటర్ తాగేలా చూసుకోండి.
  • ఎండలో బయటకి వెళ్ళినపుడు టోపీని వేయండి లేదంటే గొడుగు తీసుకు వెళ్ళండి
Tags:    

Similar News