ఆమె ఓ గొప్ప నటి.. హీరోయిన్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం స్టార్ హీరోయిన్లంతా ప్రభాస్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ఆ అవకాశమే.. Latest Telugu News..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం స్టార్ హీరోయిన్లంతా ప్రభాస్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ఆ అవకాశమే వారికి పెద్ద అచీవ్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నారు. అటువంటిది ప్రభాస్ నుంచి ప్రశంసలు అందుకుంటే అది ఇంకా పెద్ద సక్సెస్ అనే చెప్పుకోవాలి. 'సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్ దీన్ని అందుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాను ఆకాశానికెత్తేశాడు. తన కెరీర్‌లో నటించిన గొప్ప హీరోయిన్‌లలో శ్రద్ధా కూడా చేరిందని, ఆమె డెడికేషన్ మామూలిది కాదంటూ పొగిడేశాడు. తామిద్దరం 'సాహో' చేసేటప్పుడు చాలా ఒత్తిడి ఉండేదని, ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇలా అనేక ప్రశ్నలు ఎదురయ్యేవని, అంతటి ఒత్తిడి సమయాల్లో కూడా శ్రద్ధా ఫుల్ సపోర్ట్ చేసేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఓవర్ నైట్‌లో నెట్టింట శ్రద్ధా హాట్ టాపిక్ అయిపోయింది. మరి ప్రభాస్ తన మూవీ లైన్‌లో ఏదైనా సినిమా కోసం అమ్మడితో మళ్లీ జతకడతాడేమో చూడాలి.