సూర్య కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోలు.. ఇక ఈవెంట్ మామూలుగా ఉండదు!

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’.

Update: 2024-10-14 09:22 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య (Surya) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (Kanguva). పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ (Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దిశ పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ (Studio Green), యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ చిత్రం నవంబర్ 14న ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్‌తో సహా మొత్తం ఎనిమిది భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ‘కంగువ’ ఆడియో లాంచ్ (audio launch)కు సంబంధించిన అప్‌‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ ఆడియో లాంచ్ ఈవెంట్స్‌కు అతిథులను ఫైనల్ చేశారు మేకర్స్. ఈ మేరకు తెలుగులో ‘కంగువ’ ఆడియో లాంచ్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కు ఆహ్వానం అందించగా.. తమిళ వెర్షన్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)ను ఆహ్వానించారు. వీటికి సంబంధించిన పోస్టులు ప్రజెంట్ నెట్టింట వైరల్ కాగా.. తెలుగు ఈవెంట్‌కు ప్రభాస్‌ (Prabhas), తమిళ వెర్షన్‌‌కు రజినీకాంత్‌ (Rajinikanth) ముఖ్య అతిథులు (chief guests)గా వస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News