Bagheera: పవర్ ఫుల్‌గా ‘బఘీర’ ఫస్ట్ సింగిల్..

‘ఉగ్రమ్’ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి తాజా ప్రాజెక్ట్ ‘బఘీర’.

Update: 2024-10-17 14:25 GMT

దిశ, సినిమా: ‘ఉగ్రమ్’ (Ughram) ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి (sree murali) తాజా ప్రాజెక్ట్ ‘బఘీర’ (Bagheera). ఎక్సయిటింగ్ యాక్షన్ (Exciting Action) ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కథ అందించగా.. డాక్టర్ సూరి (Dr. Suri) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ (Hombale Films) బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ (First Single) ‘రుధిర హర’ విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశారు మేకర్స్.

న్యాయానికి సంబంధించిన ఈ సాంగ్ అనేక రకాల భావోద్వేగాలతో పవర్ ఫుల్ (Powerful) కంపోజిషన్‌తో ఆకట్టుకుంది. రాంబాబు గోసాల (Rambabu Gosala) ఇంపాక్ట్ ఫుల్ లిరిక్స్ బ్యాక్ డ్రాఫ్‌ని పవర్ ఫుల్ (Powerful)గా ప్రజెంట్ చేశాయి. ఈ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ డెప్త్ (emotional depth) కూడా ఉంటుందని సాంగ్ చూస్తేనే అర్థం అవుతోంది. ప్రజెంట్ (present) ఈ సాంగ్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా.. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

Tags:    

Similar News