యువతకు ఫ్రీ కోచింగ్ ఇవ్వండి: పీడీఎస్‌యూ
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల - PDSU leaders demanded that the government provide free accommodation and coaching facilities to unemployed youth
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే ఉచిత వసతి, కోచింగ్ సౌకర్యం అందించాలని పీడీఎస్‌యూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షలకు పైగా టీఎస్‌పీఎస్సీ లో 26 లక్షలకు పైగా నిరుద్యోగులు తమ పేరు నమోదు చేసుకున్నారని తెలిపారు. దాదాపు 8 ఏండ్ల తర్వాత గ్రూప్1, 2, 3, 4, డీఎస్సీ, టీఆర్టీ నోటిఫఙకేషన్ వస్తోందని, కొవిడ్‌కారణంగా ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వమే ఉచితంగా సదుపాయాలన్నింటిని కల్పించాలని డిమాండ్‌చేశారు. కనీస సౌకర్యాలు పాటించకుండా విచ్చలవిడిగా నడుస్తున్న ప్రైవేట్కోచింగ్సెంటర్ల ఆగడాలు, ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. ఇదిలా ఉండగా విద్యా శాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్‌యూ నేతలు డిమాండ్ చేశారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్..
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా జూపాక శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఓయూలోని మెయిన్లైబ్రరీ వద్ద ఆదివారం నిర్వహించిన జనరల్‌బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహేష్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, కిరణ్, శ్రీకాంత్, గడ్డం శ్యామ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఆర్ గౌతమ్ కుమార్, తిరుపతి, నూనె సురేష్, చరణ్, వినోద్ తో పాటు 29 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.