వీకెండ్ మోటివేషన్ అంటూ పవన్ కళ్యాణ్ హీరోయిన్ పోస్ట్.. చాలు చాలు ఇక బూస్ట్ తాగు అంటున్న నెటిజన్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-11-16 07:10 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో అనన్య కీలక పాత్ర పోషించింది. ఇక ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘పొట్టేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రంలో నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమాలో ఈ బ్యూటీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అనన్య నాగళ్ల తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో జిమ్ ట్రైనర్‌ దగ్గర ట్రైనింగ్ తీసుకొని తన కాళ్ళతో గట్టిగా తన్ని అన్నింటిని పడేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు ‘చాలు చాలు.. ఇక బూస్ట్ తాగు అలసిపోయి ఉంటావ్’ అని, ‘తొడలు బాగున్నాయి ఏం తింటున్నావ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

Read More...

అతను కమిట్మెంట్ అడిగాడు.. ఇక చేసేదేమి లేక అలా చేశా.. రామ్ హీరోయిన్ సంచలన కామెంట్స్








Tags:    

Similar News