కశ్మీర్‌ఫైల్స్ సినిమాపై రేణుదేశాయ్ ప్రశంసలు
దిశ, తెలంగాణ బ్యూరో: కశ్మీర్‌ఫైల్స్ సినిమాను ఒక సినిమాలా కాకుండా ఒక హిస్టారికల్మూమెంట్లా చూడాలని జమ్మూకశ్మీర్మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కశ్మీర్‌ఫైల్స్ సినిమాను ఒక సినిమాలా కాకుండా ఒక హిస్టారికల్మూమెంట్లా చూడాలని జమ్మూకశ్మీర్మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ పేర్కొన్నారు. నాగోల్‌లోని శుభం గార్డెన్లో డిజిటల్హిందూ కాంక్లేవ్కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో హిందువులపై జరిగిన దాడులను కండ్లకు కట్టినట్లు చూపించారని ఆయన తెలిపారు. ఈ సినిమా ద్వారా హిందువులపై జరిగిన దాడులపై చర్చ మొదలైందన్నారు. అనంతరం మధ్యప్రదేశ్బీజేపీ ఇన్చార్జీ మురళీధర్‌రావు మాట్లాడుతూ.. హిందువులను ఎదురించిన వారికి రాబోయే రోజుల్లో భవిష్యత్ఉండదని ఆయన హెచ్చరించారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పలు పోస్టులు వస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. కశ్మీర్ ఫైల్స్‌లో చూపించిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ఫైల్స్ బీజేపీ సినిమా కాదని, 7 లక్షల బ్రాహ్మణ కుటుంబాల కష్టాల ఆధారంగా తెరకెక్కించారని ఆయన వెల్లడించారు. అనంతరం సినీ నటి రేణుదేశాయ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ రిలీజియన్ రైట్ ఉంటుందని, ఎవరి మతాన్ని వారు గొప్పగా చూడడంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలన్నారు. తాను ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదని, తాను హిందూవునని చెప్పుకోవడానికి మాత్రం గర్వపడుతున్నట్లు స్పష్టం చేశారు. మతాలకన్నా ముందు మనుషులమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.