Hari Hara Veera Mallu| Pawan Kalyan: పాన్ ఇండియా రేంజ్‌లో పవన్ మూవీ.. వైరల్‌గా న్యూ రిలీజ్ డేట్

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..Latest Telugu News

Update: 2022-04-25 11:33 GMT

Hari Hara Veera Mallu| Pawan Kalyan

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్, 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇండియా వైడ్‌గా గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తెలుగులో ఏ హీరోకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సైతం మొదటిసారి పాన్ ఇండియా దిశగా అడుగులేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని ఇండియావైడ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసేందుకు డైరెక్టర్ క్రిష్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 5న దసరా కానుకగా 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ పీరియాడిక్ డ్రామాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News