ఎట్టకేలకు వరల్డ్ కప్‌లో బోణికొట్టిన పాక్
హామిల్టన్ : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌లో దాయాది పాక్ జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. ఆథిత్య న్యూజిలాండ్‌లో latest telugu news..
హామిల్టన్ : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌లో దాయాది పాక్ జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. ఆథిత్య న్యూజిలాండ్‌లో హామిల్టన్ వేదికగా జరిగిన వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించగా, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 89 పరుగులు మాత్రమే చేసింది. 90 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సులువుగా ఛేదించింది. పాక్ స్పిన్నర్ నిదాదార్ కేవలం 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించింది.
ఇకపోతే 2009 తర్వాత పాకిస్తాన్ తొలిసారి వరల్డ్ కప్‌లో విజయం సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ డాటిన్(27) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ(37), కెప్టెన్ మహారూప్(20) పరుగులతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. కాగా, వరల్డ్ కప్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన పాక్ జట్టు 4 పరాజయాలు, ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతోంది.