Mallikarjun Kharge: విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను అవమానిస్తారా..?
Opposition Claims Mallikarjun Kharge Was Insulted at Murmu's Swearing-in| నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేను అగౌరపరిచాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ మేరకు రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడుకు లేఖ ద్వారా ఫిర్యాదు
న్యూఢిల్లీ: Opposition Claims Mallikarjun Kharge Was Insulted at Murmu's Swearing-in| నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేను అగౌరపరిచాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ మేరకు రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాయి. ఖర్గేకు ఇచ్చిన సీటు, ఆయన నిర్వహించిన పదవికి పొంతన లేదని లేఖలో పేర్కొన్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఆయన పదవికి తగ్గట్లుగా సీటు కేటాయించలేదు. సీనియర్ నాయకుడి విషయంలో ప్రోటోకాల్‌ను పాటించలేదు' అని పేర్కొన్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి స్పందించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ ప్రకారం ఖర్గేకు మూడో వరుసలో సీటు కేటాయించినట్లు చెప్పారు. అంతకుముందు విడ్కోలు సమావేశంలో ఆయనకు మొదటి వరుసలో సీటు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అనవసరమైన విషయాలకు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: రూ,100కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇస్తాం..