'ఎఫ్ఐఆర్'పై ముదురుతున్న వివాదం.. బ్యాన్ చేయాలంటూ ముస్లింల డిమాండ్

Update: 2022-02-12 07:24 GMT

దిశ, సినిమా: హీరో విష్ణు విశాల్ సినిమా 'ఎఫ్ఐఆర్' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌పై మాస్ ఆడియన్స్, యూత్ ప్రశంసలు కురిపిస్తుంటే.. మరోవైపు సంప్రదాయవాదులు, ముస్లింలు చిత్రంపై భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మూవీలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఆ సీన్లను సినిమా నుంచి, ప్రమోషనల్ వీడియోల నుంచి తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ చిత్రంలో హీరో ఓ ముస్లిం యువకుడి పాత్ర పోషించాడు. ఇందులో విలన్‌ను కూడా ముస్లిం మతానికి చెందిన టెర్రరిస్ట్‌గా చూపించగా హీరో, విలన్‌కు దగ్గరి పోలికలుంటాయి. దీంతో హీరోను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని అడిగిన ప్రశ్నలు కాంట్రవర్సీగా ఉన్నాయంటూ ఎంఐఎం నేత- యాకుత్ పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు లేఖ రాశారు. తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 సెక్షన్ 8 ప్రకారం ఆ సన్నివేశాల్ని తొలగించాలంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిలిపివేయగా.. 'భారతీయులు గర్వించేలా ఈ మూవీ రూపొందించాం. ఏ మతాల్నీ, వ్యక్తుల్నీ కించపరిచేలా తీయలేదు. నిజంగా ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే అందుకు క్షమాపణలు కోరుతున్నాం. ఇది కేరళలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగానే తెరకెక్కించాం' అంటూ మూవీ యూనిట్ స్పష్టం చేసింది.

https://twitter.com/Karthikravivarm/status/1492053292662554625?s=20&t=-hukWusCM7qTfKlmn1NkWg

Tags:    

Similar News