ఆ విషయం గురించి అడిగినందుకు చాలా అవకాశాలు కోల్పోయాను.. స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్

హీరో యశ్(Yash) ‘కేజీఎఫ్’(KGF) సినిమాతో వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.

Update: 2025-03-25 03:26 GMT
ఆ విషయం గురించి అడిగినందుకు చాలా అవకాశాలు కోల్పోయాను.. స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: హీరో యశ్(Yash) ‘కేజీఎఫ్’(KGF) సినిమాతో వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ ‘కేజీఎఫ్’మూవీ హిట్ కావడంతో యశ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ వచ్చింది. దీంతో ఈ సినిమాకు పార్ట్-2ను తెరకెక్కించారు. ఇక అది కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో యశ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’(Toxic). దీనిని ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్(Geethu Mohandas) తెరకెక్కిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

ఇందులో యశ్ అక్కగా నయనతార(Nayanthara) నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా, యశ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ నాకు పొగరు అనుకునేవారు. నేను దర్శకులను స్క్రిప్ట్ కాపీ అడిగేవాడిని. కథ నచ్చకపోతే దానిపై నమ్మకం కుదరకపోతే సినిమా ఎలా చేయగలను.

అందుకే దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక మొదలుపెడదాం అనుకునే వాడిని. అలా చేయడం కొందరికి నచ్చేది కాదు. దీని వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను. ఈ సమయంలోనే నన్ను ‘మొగ్గిన మనసు’మూవీ నిర్మాత నన్ను బాలా నమ్మాడు. దర్శకుడు శశాంక్ కథ పూర్తిగా చెప్పడంతో పాటు నా పాత్ర గురించి వివరించడంతో ‘టాక్సిక్’ షూట్‌లో జాయిన్ అయ్యాను. ఈ సినిమా యూనిట్ మొత్తంపై నాకు ఎనలేని గౌరవం ఏర్పడింది’’అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యశ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News

Nivetha Thomas