దుమ్ముగూడెం బరాజ్ రీసర్వే.. వాటిపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో : గోదావరిపై నిర్మించే దుమ్ముగూడెం బరాజ్ ఎత్తు పెంపుపై సర్వేకు ప్రభుత్వం మరోసారి
దిశ, తెలంగాణ బ్యూరో : గోదావరిపై నిర్మించే దుమ్ముగూడెం బరాజ్ ఎత్తు పెంపుపై సర్వేకు ప్రభుత్వం మరోసారి ఆదేశాలిచ్చింది. గతంలోనే దీనిపై సర్వే చేయగా.. పలు కారణాలతో నిలిపివేశారు. అయితే అప్పటికే సర్వే సంస్థకు నిధులు విడుదల చేశారు. తాజాగా దుమ్ముగూడెం బరాజ్ ఎత్తు 1 మీటరు పెంచేందుకు రీ సర్వే చేయాలని కాన్టెక్ డీఈఎస్ సంస్థకు ఆదేశాలిచ్చారు. దీని కోసం సవరణ అంచనాలతో రూ. 1.91 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పాలన అనుమతులు జారీ చేసింది. దుమ్ముగూడెం బరాజ్ నిర్మాణంలో భాగంగా రివర్ బెడ్, జియలాజికల్ ఇన్వెస్ట్‌గేషన్, డిజైన్, డ్రాయింగ్‌తో పాటుగా ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.