డ్యూటీ డుమ్మాలపై 'ఫోకస్'
వైద్యారోగ్యశాఖలో డ్యూటీలకు డుమ్మాలు కొట్టే వాళ్లపై సర్కార్ఫోకస్పెట్టింది.
దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్యశాఖలో డ్యూటీలకు డుమ్మాలు కొట్టే వాళ్లపై సర్కార్ఫోకస్పెట్టింది. సర్కార్ ఆసుపత్రుల్లో పనిచేసే స్టాఫ్‌తో పాటు మెడికల్యూనియన్ల లీడర్లపై కూడా దృష్టి పెట్టింది. సకాలంలో విధులకు హాజరవుతున్నారా? లేదా? ఆసుపత్రుల్లో ఎంత సేపు పనిచేస్తున్నారు? పర్మమెన్స్ ఎలా ఉన్నది? వంటి వివరాలన్నీ సేకరిస్తున్నది. ప్రత్యేక టీమ్‌లు ఈ వివరాలన్నీ సిక్రేట్‌గా నమోదు చేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లా ఆసుపత్రులపై కూడా ఫోకస్పెట్టింది. పూర్తి స్థాయి రిపోర్టులు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎందుకీ నిర్ణయం..?
317 జీవో అమలు తర్వాత అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల స్టాఫ్ హెచ్ఓడీల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరికి మద్ధతుగా కొందరు వైద్యారోగ్యశాఖలోని యూనియన్ సభ్యులు హెచ్ఓడీలు, మంత్రులు పేషిల చుట్టూ వెంట పెట్టుకొని పోస్టింగ్‌ల కొరకు తిరుగుతున్నారు. దీంతో ఆసుపత్రుల్లోని సేవలకు ఆటంకం కలుగుతున్నదని ఆయా ఆసుపత్రుల అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి వచ్చి మొక్కుబడిగా రెండు మూడు గంటలు పనిచేసి ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో డ్యూటీ సమయంలో హెచ్ఓడీలు, మంత్రి పేషీ కార్యాలయాలకు ఎందుకు వెళ్తున్నారని ప్రభుత్వం సిక్రెట్గా సర్వే చేపిస్తున్నది.