నగ్న కళంకం.. లైంగిక భావన లేకుండా నగ్న చిత్రాల సృష్టి
దిశ, ఫీచర్స్ : మానవ శరీరాలు కేవలం ఇంద్రియ ప్రయోజనాల కోసమో లేదా అంతర్లీనంగా దాగిన ఆనందం కోసమో ఉద్దేశించినవి
దిశ, ఫీచర్స్ : మానవ శరీరాలు కేవలం ఇంద్రియ ప్రయోజనాల కోసమో లేదా అంతర్లీనంగా దాగిన ఆనందం కోసమో ఉద్దేశించినవి కాదని నిరూపిస్తున్నాడు ఓ న్యూడ్ ఫొటోగ్రాఫర్. అతడి కెమెరా లెన్స్ స్త్రీ రూపాన్ని అత్యంత సహజమైన అర్థంలో సూచిస్తోంది. శరీరాల పట్ల స్పష్టమైన ఆరాధన, సాధారణ నగ్నత్వం చుట్టూ సానుకూల భావనను సెట్ చేస్తున్న ఆయన కళ.. మనకు శరీరం, దాని గురించిన లోతైన దృక్పథాన్ని అందిస్తోంది. ఆ చిత్రాలు ఏ రంగులో ఉన్నా.. న్యూడ్ ఆర్ట్ ఫొటోగ్రఫీ వెనకున్న తన ఉద్దేశాన్నే ప్రకాశింపజేస్తున్నాయి. వారాంతాల్లోనే తన కళతో నగ్న చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువ ఇంజనీర్ రిక్రువు బెనర్జీ.. అందం గురించి చెలామణిలో ఉన్న భావనలను పునరాలోచించేలా చేస్తున్నాడు.
బెనర్జీ పదేళ్లుగా ఈ కళారూపంతో ప్రేమలో ఉన్నాడు. 14ఏళ్ల వయసులో తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన కెమెరాతో మొదటిసారి ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. అలా పెరిగిన ఆసక్తితో బెనర్జీ సొంతంగా ఫొటోగ్రఫీ స్కిల్స్ నేర్చుకోగలిగాడు. ఇక ఏడాది తర్వాత పైచదువుల కోసం జర్మనీలోని క్లీవ్‌కు వెళ్లిన తనకు అక్కడ న్యూడ్ ఆర్ట్ ఫొటోగ్రఫీ పరిచయమైంది. భావోద్వేగాలను క్యాప్చర్ చేయడానికి కెమెరా ప్రసాదించే స్వేచ్ఛను కనుగొన్నాడు. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో.. నగ్న శరీరాలను మార్చే ఒక ప్రొఫైల్‌ను ఫాలో అవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే స్వీయ చిత్రాలను తీస్తూ ఆ చిత్రాల కంటే వాటిని క్లిక్ చేసే ప్రక్రియతోనే ప్రేమలో పడ్డట్లు చెప్పుకొచ్చాడు బెనర్జీ. క్రమంగా తన ఫొటోగ్రఫీ కోసం క్లోజ్ ఫ్రెండ్స్‌ను మోడలింగ్ చేయమని అడిగేవాడు. ఇది మెల్లగా వ్యాపించి.. తమ భాగస్వాములకు సన్నిహిత చిత్రాలను బహుమతిగా ఇవ్వాలనుకునే చాలామంది తనను ఫొటో షూట్ చేస్తావా? అని అడిగే వరకు వచ్చింది. ఆ డబ్బు జర్మనీలో ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఉపయోగపడింది.
కోర్సు పూర్తయిన తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన బెనర్జీ ఇంజనీర్‌గా పని చేయడం ప్రారంభించాడు. భారత్‌లో న్యూడ్ ఆర్ట్‌ను అంగీకరిస్తారో లేదో అని ఒక ఏడాది పాటు ఫొటోగ్రఫీకి విరామం ఇచ్చాడు. అయితే ఒక్క అవకాశం మళ్లీ అతన్ని కెమెరా వైపు దారిమళ్లించింది. ఇదే ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ఒక స్నేహితురాలిని బెనర్జీ కలిసిన తర్వాత మోడల్‌గా చేసేందుకు అంగీకరించింది. ఆమెతో తీసిన చిత్రాలకు మంచి ఆదరణ లభించడంతో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాడు.
'ప్రతి ఫ్రేమ్‌కు కనెక్ట్ అయ్యే కథ ఉండాలి'
న్యూడ్ ఆర్ట్‌లో శరీరాన్ని బహిర్గతపరచడం కంటే దానిని ప్రదర్శించడమే కళాత్మకంగా ఉంటుందని, ప్రతి ఫ్రేమ్‌కు కనెక్ట్ అయ్యే కథ ఉండాలనేది బెనర్జీ పాయింట్. ముందుగా మోడల్ ఈ కళారూపం గురించి ఎలా భావిస్తుందో అర్థం చేసుకుంటాడు. ఇద్దరి మధ్య కంఫర్ట్‌నెస్ ఏర్పడిన తర్వాత ఓపెన్-ఎండెడ్ ప్రక్రియను అనుసరిస్తాడు. దుఃఖం లేదా సంతోషం వంటి భావోద్వేగాన్ని మోడల్‌కు వివరించి దానిని ఎమోట్ చేయమని అడుగుతాడు. అలాగని తను ఒకే షాట్ తీసుకోడు. ఆమె తన మూడ్ క్యారీ చేస్తుండగా క్లిక్ చేస్తూనే ఉంటాడు. ఈ క్యూ ప్రాసెస్‌లో వారి మనస్సు పనిచేయడం ప్రారంభించినపుడు చూసే భాగం చాలా అందంగా ఉంటుంది. కాబట్టి తను దాన్నే సంగ్రహించాలని అనుకుంటాడు. ఎందుకంటే 'ఏ రెండు వ్యక్తీకరణలు ఎప్పుడూ ఒకేలా ఉండవు' అనేది బెనర్జీ సిద్ధాంతం. న్యూడ్ ఆర్ట్‌కు సంబంధించి ఏ పరిస్థితి నుంచి అయినా చిత్రాలను పొందడానికి మోడల్‌తో ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. అంటే ఇతర కళారూపాల వలెనే ఇక్కడ కూడా కో-క్రియేటర్స్‌ను కంఫర్ట్‌గా ఉంచడం చాలా ముఖ్యం.
ఇన్‌స్టాగ్రామ్‌తో ట్రికీ రిలేషన్
బెనర్జీ ఒక్క షూట్‌లో దాదాపు 1000 చిత్రాలు క్లిక్ చేస్తాడు. అందులో నుంచి 200 షార్ట్‌లిస్ట్ చేసి చివరకు 40 చిత్రాలు ఫైనల్ చేస్తాడు. కానీ 2 లేదా 3 చిత్రాలే పోస్ట్ చేస్తాడు. ఎవరైనా తన కళను వారి కోణంలో భిన్నంగా గ్రహిస్తారనే విషయం బెనర్జీకి తెలుసు. అందుకే వారనుకునే అర్థాలను తెలిపేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే బెనర్జీ ఆ చిత్రాలను పోస్టు చేసినపుడు ఎలాంటి నేపథ్యాన్ని, వివరణను జోడించడు. అది ఆ చిత్రాన్ని ఎక్స్‌ప్లోర్ చేసే పరిధిని పరిమితం చేస్తుందనేది అతని భావన. ఇక ఇన్‌స్టాగ్రామ్‌తో అతని సంబంధం గమ్మత్తయినది. ప్రస్తుత పేజీ @nuancedart బెనర్జీ మూడవ ప్రొఫైల్. మొదటి రెండు పేజీలు ఫాలోవర్స్ పెరిగిన తర్వాత తొలగించబడ్డాయి. ఇందుకు గల కారణాల్లో ఇన్‌స్టాలో పెరుగుతున్న కఠినమైన సెన్సార్‌షిప్ ఒకటి. ఇంకా అతను నగ్నత్వాన్ని సాధారణీకరించడానికి, కళారూపాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నంలో ఈ ప్రొఫైల్‌ను రూపొందించడానికి కట్టుబడి ఉన్నాడు. ఏదో ఒక రోజు, ఇతర కళారూపాల వలె నగ్న కళకు కూడా Instagram విస్తరిస్తుందని అతను ఆశిస్తున్నాడు.
సెక్సవల్‌గా లేకుండా నగ్నత్వ ప్రదర్శన
ఇప్పుడు చాలా మంది వ్యక్తులు నగ్నత్వం వెనకున్న కళంకాన్ని ఛేదించి తమ ఆర్ట్‌ను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికీ అంతర్లీనంగా కొంత కళంకం ఉందని అంగీకరిస్తున్న బెనర్జీ.. నగ్నత్వాన్ని ప్రబలంగా ప్రతిబింబించిన హిందూ సంస్కృతిలోని గొప్ప అంశాలను చూపాడు. ఉదాహరణకు : ఖజురహో, కోణార్క్ సూర్య దేవాలయం గోడలపై నగ్నత్వం చిత్రీకరించబడింది. గ్రంథాల్లోనూ పుష్కలంగా సమాచారం ఉంది. కానీ ఏదో ఒక విధంగా అది స్త్రీ నమ్రత, పవిత్రతకు అనుసంధానించబడింది. అంటే ఇవన్నీ ఎవరైనా నగ్నంగా ఉన్నందున వారు గౌరవనీయులు కాదనే అర్థాన్నే బోధించాయి. కాబట్టి నగ్న కళను ఒక కళారూపంగా గుర్తించాలనేది బెనర్జీ కోరిక.
వృత్తిపరమైన విధానమే..
న్యూడ్ ఫొటోషూట్ చేస్తున్నప్పుడు మోడల్స్ పట్ల లైంగిక కోరికను పెంచే ప్రమాదంపైనా బెనర్జీ వివరణ ఇచ్చారు. 'ఒక వైద్యుడు రోగిని తనిఖీ చేసినప్పుడు లేదా ఇంజనీర్ గ్రాఫ్ తయారు చేసినప్పుడు అలాగే ఉంటారా? నేను వృత్తిపరమైన విధానాన్ని కలిగి ఉన్నాను. మొత్తం ప్రక్రియ స్వతహాగా స్వేచ్ఛా వాతావరణంలో జరుగుతుంది. నేను దానిని లైంగీకరించాల్సిన అవసరం లేదు. నా కళను అత్యంత నిజాయితీతో సాధన చేయడం నాకు చాలా ముఖ్యం. నగ్నత్వం, కోరిక మధ్య సమాంతర రేఖ గీసేందుకే నా ప్రధాన పోరాటం' అని బెనర్జీ పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ముగ్గురితో మహిళ రాసలీలలు.. పక్కింటి ఆంటీ టాపిక్‌తో సీన్ రివర్స్