పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ..

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య యాజమాన్య కోటా సీట్ల- latest Telugu news

Update: 2022-03-31 12:30 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మిగిలిన పీజీ యాజమాన్య కోటా సీట్లను ఈ మాప్ అప్ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. యాజమాన్య కోటకు ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 6గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గత విడత కౌన్సిలింగ్‌లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా.. అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్‌కు అనర్హులు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Tags:    

Similar News