హైడ్రోజన్ కారును ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ!

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత ..telugu latest news

Update: 2022-03-16 16:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అధునాతన ఫ్యుయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం(ఎఫ్‌సీఈవీ) టయోటా 'మిరాయ్‌'ను ఆవిష్కరించారు. దీంతో దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే కారుగా ఇది నిలిచింది. ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రముఖ వాహన తయారీ దిగ్గజం టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బుధవారం లాంచ్ అయిన టయోటా మిరాయ్ ఎస్‌యూవీ వాహనం దాదాపు 650 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని, దీనికి హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడతారని కంపెనీ తెలిపింది. ఈ కారును తక్కువ ఖర్చుతో నడపవచ్చని, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా హైడ్రోజన్ స్టేషన్లు ఏర్పాటవుతాయని నితిన్ గడ్కరీ చెప్పారు.

భవిష్యత్తులో టయోటా కంపెనీకే చెందిన కామ్రీ కారు మోడల్‌ను ఫ్లెక్సీ ఇంజిన్‌తో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు గ్రీన్ హైడ్రోజన్ వినియోగంపై అవగాహన పెంచడమే లక్ష్యమని, గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు ఫ్లెక్స్ ఇంజిన్ వాడకం వల్ల ఇంధన ధరలను నియంత్రించగలమని ఆయన వివరించారు.

Tags:    

Similar News