దిశ, సినిమా : బబ్లీ అప్పియరెన్స్‌తో దక్షిణాదిన గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ యూనిక్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే, కాస్త బొద్దుగా తయారవడంతో రేసులో వెనకబడ్డ నిత్య.. ప్రస్తుతం స్లిమ్ బాడీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో 6 కిలోల బరువు తగ్గిన మలయాళీ బ్యూటీ.. ఇందుకోసం తాను పాటించిన ఆరోగ్య సూత్రాలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసిన నిత్య.. 'బరువు తగ్గేందుకు కొవ్వు కరిగించే ఆపరేషన్ చేయించుకోమన్నారు.
కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు. డైట్ ఎక్స్పర్ట్స్ సలహాలు, సూచనలతో ఆహారంలో మార్పులు చేసుకున్నాను. క్రమం తప్పకుండా వాకింగ్, వర్కవుట్స్ చేశాను. దాదాపు ఐదు నెలల నుంచి డైట్ కంట్రోల్ పాటిస్తున్నాను. నా శ్రమకు ఫలితమే ఈ స్మార్ట్‌లుక్. ఇప్పటికే ఆరు కేజీల బరువు తగ్గాను. అయినా నా ఓల్డ్ స్లిమ్ లుక్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను 'భీమ్లానాయక్' మూవీలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడీగా కనిపించనుంది.