రైల్వే స్టేషన్లలో కొత్త నిబంధనలు.. అప్పటినుంచే అమలు?

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానుంది..Latest Telugu News

Update: 2022-07-01 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానుంది. ఆగస్టు 1st నుండి దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ విషయంలో క్యాష్‌లెస్ చెల్లింపు చేయాలని రైల్వే బోర్డ్ నిర్ణయించింది. అంటే తినే వస్తువులు, వాటర్ బాటిల్స్ లాంటి వస్తువులు విక్రయించేటప్పుడు డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేయాలని నిబంధన పెట్టింది.

అలా చేయడంలో విఫలమైతే రూ.10,000, నుంచి రూ.1,00,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఏ వస్తువు అయినా సరే ఉన్న రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్మితే కూడా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఫ్లాట్‌ఫారమ్‌లోని క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో మొటీరియల్‌ను డిజిటల్ పద్ధతిలో విక్రయించాలని పేర్కొంది. దీంతోపాటు చెల్లింపుల కోసం కొనుగోలు దారులు కూడా తప్పనిసరిగా UPI Paytm, పాయింట్ ఆఫ్ సెల్ మెషిన్లు, స్వైప్ మెషిన్లను కలిగి ఉండాలని పేర్కొంది.


Similar News