దూసుకుపోతున్న 'లక్నవరం గెస్ట్ హౌస్'.. సినీ రంగాన్ని ఆకర్షిస్తున్న ములుగు

Update: 2022-03-26 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు సినీ రంగాన్ని ఆకర్షిస్తున్నాయి. ములుగు జిల్లాలోని లక్నవరం చెరువుపై ఏర్పాటు చేసిన తేలియాడే వంతెన తెలుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సినీ దర్శకులు ములుగు ప్రాంతంలో షూటింగ్ చేస్తే బాగుంటుందని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో లక్నవరంలోని టూరీజం గెస్ట్ హౌస్ వద్ద సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ నేపథ్యంలో సినీ తారలు లక్నవరం వద్ద సందడి చేశారు. అందరినీ ఆకట్టుకునే విధంగా సరికొత్తగా తెరకెక్కుతున్న సినిమా 'లక్నవరం గెస్ట్ హౌస్'.

ఈ సినిమాను చిత్రీకరణ ములుగులోనే మొదలైంది. ఈ మూవీని ఎస్‌వి సినిమాస్ బ్యానర్‌పై సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సాయి కిరణ్ ఖరే నిర్మిస్తున్నారు. అయితే ములుగు జిల్లా లక్నవరంలో ప్రారంభమైన 'లక్నవరం గెస్ట్ హౌస్' సినిమా చిత్రీకరణ శరవేగంతో దూసుకుపోతోందని, ప్రతి ఒక్కరు పూర్తి స్థాయి డెడికేషన్‌తో పని చేస్తున్నారని నిర్మాతలు రమేష్, సాయి కిరణ్ ఖరే చెప్పారు. తమ సినిమాకు, టీంకు సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తకు మూవీ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.


అలాగే టూరిజం శాఖ అధికారులు అశోక్, సుమన్, కిరణ్, కాకతీయ రిసార్ట్స్ అధినేత దినేష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అయిలు రమేష్ మాట్లాడుతూ.. లక్నవరం లాంటి అందమైన లోకేషన్‌లలో షూటింగ్ జరుపుకుంటున్న "లక్నవరం గెస్ట్ హౌస్" చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పారు. ఈ చిత్రంలో సాయి తేజ, మమత, నిహారిక, రజాక్, శివ తేజ, శీలం శ్రీనివాస్, బీఎస్‌ఆర్, మర్రి రాజు యాదవ్, ఉప్పులేటి మల్లేశం, బాలు , అశోక్, మల్యాల మల్లయ్య గౌడ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్ : శివ, మేకప్: అశోక్ శ్రీ రామోజు, అసిస్టెంట్ డైరెక్టర్: రాజు మర్రి, రచనా సహకారం: శివ ముప్పూరి, దేవి తోటాడ, నిర్మాత: సాయి కిరణ్ ఖరే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: అయిలు రమేష్

Tags:    

Similar News