పరిశుభ్రత నిర్వహణలో దేశ ప్రశంసలు అందుకుంటున్న నెహ్రూ జూలాజికల్ పార్క్
దిశ, బహదూర్ పుర: పరిశుభ్రతతో పాటు వన్య మృగాల సంరక్షణతో నెహ్రూ జూలాజికల్ పార్క్ యావత్ దేశ latest telugu news..
దిశ, బహదూర్ పుర: పరిశుభ్రతతో పాటు వన్య మృగాల సంరక్షణతో నెహ్రూ జూలాజికల్ పార్క్ యావత్ దేశ ప్రశంసలందుకుంటోందని కేంద్ర అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ చంద్రప్రకాష్ గోయల్ అన్నారు. శనివారం చంద్రప్రకాష్ గోయల్ ఐఎఫ్ఎస్, ప్రభుత్వ సలహాదారు ఆర్. శోభ, జూ పార్క్ డిప్యూటీ డైరెక్టర్ ఎం. ఏ. హకీమ్, జూ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజశేఖర్, డిప్యూటీ క్యూరేటర్ ఎ. నాగమణి, ఇతర అధికారులతో కలిసి హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా సి పి గోయల్ కు జూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ జూలాజికల్ పార్క్ నిర్వహణ గురించి.. జూ అధికారులు ఆయనకు వివరించారు.
కొత్తగా నిర్మించిన బర్డ్స్ ఏవియరీ, బటర్‌ఫ్లై పార్క్, ఎన్‌క్లోజర్‌లను చూడటానికి గోయల్ ఆసక్తి కనబరిచారు. జూ వెటర్నరీ హాస్పిటల్, జంతువుల పిల్లల పెంపక కేంద్రం ఇన్‌పేషెంట్ వార్డును కూడా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డున జూ పార్క్ ఒక చిట్టడివిని తలపిస్తుందని ఆయన అన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. త్వరలో సెంట్రల్ జూ అథారిటీ సభ్యులతో కలిసి నెహ్రూ జూలాజికల్ పార్క్ ను సందర్శిస్తామని ఆయన తెలిపారు.