ఆయుష్ ప్రవేశాలకు నీట్ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గింపు

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: యూజీ ఆయూష్ సీట్ల ఖాళీల భర్తీకి - NEET Eligibility Cutoff Score Reduction for AYUSH Admissions

Update: 2022-04-01 13:13 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: యూజీ ఆయూష్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూజీ 'నీట్' ఆయూష్ కటాఫ్‌ స్కోర్‌ ను 5% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు క్వాలిఫయింగ్‌ కటాఫ్‌ జనరల్‌ కేటగిరీ 45వ పర్సెంటైల్‌, దివ్యాంగులు (జనరల్‌)కు 40, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్‌ కేటగిరీలకు 35 పర్సెంటైల్‌గ నిర్ణయించారు. కటాఫ్‌ మార్కులు తగ్గడంతో ఇందుకనుగుణంగా అర్హులైన అభ్యర్థులు బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ కన్వీనర్‌ కోటా అలాగే బీహెచ్‌ఎంఎస్ యాజమాన్య కోటాలలో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరోసారి ప్రవేశ ప్రకటనలను జారీ చేసింది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు కన్వీనర్, యాజమాన్య కోటాలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలిసి ఉంటుంది. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 2న ఉదయం 8 గంటల నుంచి 3న మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సివుంటుంది . దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విదుదల చేస్తారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.

Tags:    

Similar News