16 వేల మంది పౌరులు వెనక్కి.. వెల్లడించిన పౌరవిమానయాన శాఖ
ఢిల్లీ: ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఇప్పటివరకు దాదాపు 16వేల మంది భారతీయులను- latest Telugu news
ఢిల్లీ: ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఇప్పటివరకు దాదాపు 16వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11 ప్రత్యేక విమానాల్లో 2,135 మంది పౌరులను తీసుకొచ్చినట్లు తెలిపింది. సోమవారం మరో 8 విమానాల్లో 15 వందల పౌరులు స్వదేశానికి రానున్నట్లు పేర్కొంది. 'ఆపరేషన్ గంగా మిషన్‌లో నేడు(ఆదివారం) 11 ప్రత్యేక విమానాల్లో 2,135 భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి తీసుకువచ్చాం. దీంతో గత నెల 22 నుంచి భారత్‌కు వచ్చిన వారి సంఖ్య 15,900 దాటింది' అని వెల్లడించింది. క్రితం రోజు 66 ప్రత్యేక విమానాల్లో 13వేల మంది పౌరులను భారత్‌కు తీసుకువచ్చామని పేర్కొన్న సంగతి తెలిసిందే. వీటిలో భారత వాయుదళ విమానాలు 2,056 మందిని వెనక్కి తీసుకొచ్చాయి. కాగా, సోమవారం బుడాపెస్ట్ నుంచి 5, సుసెవా నుంచి 2, బుకారెస్ట్ నుంచి ఒక విమానం రానున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సియోచిన్ నగరంలోని భారత పౌరులను తరలించినట్లు ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ తెలిపింది. వారి భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.