Draupadi Murmu: మోదీతో ద్రౌపది ముర్ము భేటీ

NDA's Presidential Candidate Draupadi Murmu Meets PM Modi| ప్రధాని నేరేంద్ర మోడీతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ నుండి విమానంలో

Update: 2022-06-23 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: NDA's Presidential Candidate Draupadi Murmu Meets PM Modi| ప్రధాని నేరేంద్ర మోడీతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ నుండి విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి మిత్రపక్షాలు, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. నామినేన్ దాఖలు కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇక విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉదయం నానినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించగా.. రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరగనుంది. జులై 21న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ దాఖలు అనంతరం మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News