చెల్లెలి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నేచురల్ బ్యూటీ.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అందరికీ సుపరిచితమే. ‘ప్రేమమ్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

Update: 2024-11-08 06:13 GMT
చెల్లెలి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నేచురల్ బ్యూటీ.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు
  • whatsapp icon

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అందరికీ సుపరిచితమే. ‘ప్రేమమ్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన ‘అమరన్’ మూవీలో నటించింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య సరసన ‘తండేల్’ మూవీతో పాటు ‘రామాయణ’ చిత్రంలో కూడా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ మనందరికీ తెలిసిందే. చూడడానికి అచ్చం సాయిపల్లవిలా ఉంటే ఈ భామ సినీ ఇండస్ట్రీలోకి మాత్రం రాలేదు. అయితే పూజా కొన్ని రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఊటీ వేదికగా పూజ, వినీత్‌ల వివాహం అంగరంగ వైభవంగ జరిగింది. తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజ. ఎప్పటిలాగే ఈ పిక్స్‌లలో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నూతన వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది ఈ బ్యూటీ.ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News