ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు - Nampally court summons AP CM YS Jagan

Update: 2022-03-24 10:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఈనెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2014లో హుజూర్‌నగర్‌లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే అభియోగంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ మేరకు సీఎం కు సమన్లు జారీ చేసింది. ఇకపోతే 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్‌పై ఈ కేసు నమోదైంది.


ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని నిలెబట్టారు. అయితే ఎన్నికల నియమావళిని పాటించకుండా.. రోడ్ షో నిర్వహించారని అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు జగన్‌తో పాటు పలువురు నేతలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News