Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు అనూహ్య నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎమ్ఐఎమ్ శ్రేణుల్లో మరింత టెన్షన్ పెరిగింది. కోర్టు తుది తీర్పులో ఏం తీర్పు చెప్పనుందో అని ఎమ్ఐఎమ్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే, పదేళ్ల క్రితం అక్బరుద్దీన్ మత విద్వేశాలు రెచ్చగొట్టేలా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హిందూవులను 15 నిమిషాల్లో చంపేస్తాను అనండంతో పాటు ఆదిలాబాద్‌లో హిందూ దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్బరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో పాటు 40 రోజుల పాటు జైల్లో శిక్ష అనుభవించారు. మరి ఈ కేసులో అక్బరుద్దీన్‌కు రేపు కోర్టు శిక్ష వేయనుందా? లేదా? అనే వేచి చూడాలి.